అనారోగ్య సమస్యల నుంచి బయట పడటానికి ప్రధానంగా విటమిన్ 'సి' తోడ్పడుతుంది. సాధారణ జలుబును సైతం సిట్రిక్ దూరం చేస్తుంది. యాంటీ ఫంగల్, క్రిమినాశక, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో నిమ్మ ఎంతో తోడ్పడుతుంది. 'సి' విటమిన్ ఉన్న ఏ పండైనా రోజుకు ఒకటి తీసుకోవడం ఎంతో శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థను పెంచుకోవచ్చు.
వెల్లుల్లిలో విటమిన్ 'ఏ', జింక్, సల్ఫర్, సెలీనియమ్‌లు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. జీర్ణ సమస్యలున్న వారు ప్రతి నిత్యం ఆహారంలో పచ్చి లేక ఉడకబెట్టిన వెల్లుల్లిని తినడం వల్ల కొద్ది రోజుల్లోనే సమస్య అదుపులోకి వస్తుంది. పచ్చి వెల్లుల్లి రెండు రెబ్బలు తింటే పొట్ట పాడవకుండా ఉంటుంది. రోజూ ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు, దగ్గును దరి చేరనివ్వదు. మొత్తంగా వ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్ ఫుల్ మెడిసిన్‌గా పనిచేస్తుంది.
రోజూ ఉదయాన్నే కరివేపాకు ఆకుల్ని నమిలి తినడం వల్ల ఒంట్లో రక్తం శుద్ధి అవుతుంది. పైగా హైబీపి, షుగర్ వంటి సమస్యలున్న వారు దీనిని పాటించడం మేలంటున్నారు వైద్యులు. కరివేపాకును సన్నని మంటపై వేయించి పొడిచేసుకుని క్రమం తప్పకుండా తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
గొంతు సమస్యలకు, లంగ్ ఇన్‌ఫెక్షన్లకు అల్లం బాగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే చిన్న సైజు లేత అల్లాన్ని కాల్చి, దాంతో పాటు చిటికెడు ఉప్పుని జోడించి తింటే ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా తోడ్పడుతుంది. అల్లాన్ని ముక్కలుగా కోసుకుని, తడి లేకుండా ఆరబెట్టి ఆ ముక్కల్ని ముందు రోజు రాత్రి తేనెలో నానబెట్టి మరునాడు పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఒక గుడ్డు, పాలు, పెరుగు తప్పక తీసుకోవడం వల్ల వైరస్‌ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవొచ్చు.
ఆహారమే అనేక రోగాలకు ఔషధం. ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే, వైరస్‌లు దరి చేరవు. ఒకవేళ చేరినా ఇమ్యూన్ సిస్టమ్ శక్తివంతంగా ఉంటే వైరస్‌లతో ఫైట్ చేయగలదు. అందుకని రోగనిరోధక వ్యవస్థకు కావాల్సిన శక్తిని ఆహారం ద్వారా అందించడమే మేలంటున్నారు వైద్యులు
No comments:
Post a Comment